Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

వేసవిలో ఆరుబయట నిద్రించిన కుటుంబం.. అర్థరాత్రి ఘోరం, నలుగురు మృతి..!

కరెంటు లేకపోవడంతో వేసవికాలం కావడం వల్ల ఉక్క పోత భరించలేక ఆరుబయట నిద్రించారు ఆ కుటుంబం. అర్ధరాత్రి ఘోరమైన సంఘటన జరిగి ఆ కుటుంబంలో నలుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

వేసవిలో ఆరుబయట నిద్రించిన కుటుంబం.. అర్థరాత్రి ఘోరం, నలుగురు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

కరెంటు లేకపోవడంతో వేసవికాలం కావడం వల్ల ఉక్క పోత భరించలేక ఆరుబయట నిద్రించారు ఆ కుటుంబం. అర్ధరాత్రి ఘోరమైన సంఘటన జరిగి ఆ కుటుంబంలో నలుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్స గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

రాత్రివేళ కరెంటు లేకపోవడంతో వేడిని తట్టుకోలేక నీరజ్ (35) అతని భార్య ఆర్తి ముగ్గురు పిల్లలతో కలిసి ఆరుబయట పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అతివేగంగా వచ్చిన ఒక డంపర్ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టి అదుపుతప్పి నిద్రిస్తున్న కుటుంబం పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని చూసేవరకే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నీరజ్ అతని కుమారుడు అనురాగ్ (13) అక్కడికక్కడే మరణించగా కుమార్తెలు హన్సిక (10), అన్షు (6) ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య ఆర్తి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఆమెను లక్నోలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ తర్వాత డంపర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు