Cm Revanth : ఆ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు.. హరీష్ రాజీనామా చేయాల్సి వస్తుందనే కొత్త నాటకం..!
Cm Revanth : ఆ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు.. హరీష్ రాజీనామా చేయాల్సి వస్తుందనే కొత్త నాటకం..!
మన సాక్షి, హైదరాబాద్ :
రైతులకు రెండు లక్షల రుణమాఫీ కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. రైతులు రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు.. బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్ముకుని రైతులు ఆగం కావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ అవుతుందని చెప్పారు.
రుణమాఫీ కాకపోయినా.. అధికారులు వారికి సూచనలు, సలహాలు ఇస్తూ మాఫీ అయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు. రైతులు రోడ్డెక్కాల్సిన బాధ ఎందుకు వచ్చిందని..? బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకుంటే ఆగమైతారని చెప్పారు. రైతులు ఒకసారి ఆలోచించాలని పేర్కొన్నారు. సమస్యలు వినకపోతే ధర్నాలు చేయాలి కానీ.. తొందరపడకుండా ఉండాలన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం వింటుందని పేర్కొన్నారు. 6 నెలల కిందనే బొందపెట్టిన వారిని మళ్లీ గ్రామాల్లోకి ఎందుకు రాణిస్తున్నారని అన్నారు.
రుణమాఫీ హామీ అమలు చేయడంతో హరీష్ రావు రాజీనామా చేయాల్సి వస్తుందని ఇదో కొత్త డ్రామా మొదలు పెట్టారన్నారు. అందువల్లనే దేవాలయాల వద్ద నిరసనలు, సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం వల్ల బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాలు పోవట్లేదు అన్నారు.
కేటీఆర్ రుణమాఫీ విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, వారు అధికారంలో ఉన్న సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారన్నారు. అయినా కూడా అందరికీ రుణమాఫీ చేయలేదన్నారు. కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేశామని, సాంకేతిక కారణాలతో కొంతమందికి ఆగినా.. వారికి కూడా చేస్తామని స్పష్టం చేశారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









