BIG BREAKING : చేపల వేటకు వెళ్లి తండ్రి, కొడుకు మృతి..!
BIG BREAKING : చేపల వేటకు వెళ్లి తండ్రి, కొడుకు మృతి..!
హత్నూర, మన సాక్షి:
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని సాధుల్ నగర్ గ్రామంలో చేపల వేటకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందారు.
వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి సాధుల్ నగర్ గ్రామానికి చెందిన చెక్కల ప్రభు (46) , కొడుకు నాగరాజ్ (23) కలదు వీరిద్దరూ మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ గ్రామ శివారులో ఉన్న చెరువు వద్దకు వెళ్లి చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో నీట మునిగి అక్కడే మృతి చెందారు.
ALSO READ : Gas cylinder : తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే.. ఆ రోజు నుంచే అమలు..!
తన కుటుంబీకులు మంగళవారం సాయంత్రం వెళ్లి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతకడంతో పక్కనే ఉన్న ఊర చెరువు లో పడి మృతి చెంది ఉన్నారు. వీరిని చూసి సదుల్ నగర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబీకులు గ్రామస్తులు బోరుణ విలపించారు.
ఈ విషయం తెలుసుకున్న హత్నూర ఎస్ ఐ కే సుభాష్ తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాలను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .
ALSO READ : నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన.. ఆమెది ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పిందంటే..!









