దుబ్బాక : తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి బీడీ కార్మికురాలు..!

దుబ్బాక : తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి బీడీ కార్మికురాలు..!

దుబ్బాక, మనసాక్షి :
పేద ముదిరాజ్ కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ జంగా కిషన్ ఉపాధి పొందుతూ తల్లి జంగ స్వప్న-కిషన్ కుమార్తె దుబ్బాక మండలం గంభీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి నా జంగా ప్రణతి త్రిబుల్ ఐటీ లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల సోమవారం పలువురు హర్షం వ్యక్తం చేశారు.

 

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కరికే భాస్కర్ మాట్లాడుతూ… తల్లిదండ్రులు తండ్రి ఆటో డ్రైవర్ నడుపుతూ… తల్లి బీడీ కార్మికురాలుగా వృత్తిని కొనసాగిస్తూ ఉపాధి పొందుతూ తమ కూతుర్ని ప్రాణతని చదివించారు. జంగా ప్రణతి త్రిబుల్ ఐటీ లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించింది.

 

ALSO READ :

1.మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

2. Bjp : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీలో దుమారం..!

3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

4. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

 

గంభీర్పూర్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కారికే భాస్కర్, ఉప సర్పంచ్ బాలయ్య, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జడ్పిటిసి కడతాల రవీందర్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ చింతు లింగం, మాజీ వైస్ ఎంపీపీ బాణాల శ్రీనివాస్,

 

మాజీ సర్పంచ్ చేపూరి పరుశరాములు గౌడ్, బాణాల సునంద, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయ బృందం, తదితరులు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.