Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసిద్దిపేట జిల్లా

Bjp : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీలో దుమారం..!

Bjp : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీలో దుమారం..!

మనసాక్షి :

భారతీయ జనతా పార్టీ దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ఆయన ఎంతో కాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే .

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. సూర్యాపేట : సహజీవనం చేసిన వ్యక్తిని అంతమొందించిన మహిళ

2.TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

3. TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

4. Rythu : వర్షాలు లేకపోవడంతో .. ఆ రైతు పంట కాపాడుకునేందుకు ఇలా కురిపించాడు..!

 

కాగా ఆయన పార్టీపై కొంత అసహనంతో ఉన్నారు. కాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ పార్టీ సీనియర్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో పుస్తెల అమ్ముకొని ప్రచారం చేసిన వ్యక్తి.. 100 కోట్ల రూపాయలతో పత్రిక యాడ్స్ ఇవ్వడానికి డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.

 

దుబ్బాక ఎన్నికల్లో తనను చూసి ఓట్లు వేశారని, తరుణ్ చుగ్ ను చూసి ఓట్లు వేయలేదు అన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

 

ఆయన చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో దుమారం రేపింది. రెండవసారి దుబ్బాకలో తానే గెలుస్తానని అన్నారు.

మరిన్ని వార్తలు