సూర్యాపేట : సహజీవనం చేసిన వ్యక్తిని అంతమొందించిన మహిళ

సూర్యాపేట : సహజీవనం చేసిన వ్యక్తిని అంతమొందించిన మహిళ

సూర్యాపేట , మనసాక్షి

సహజీవనం చేసిన వ్యక్తిని ఓ మహిళ అంతమందించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఉమా నూతనకల్లు మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన వెంకటేష్ తో సహజీవనం చేస్తూ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు.

 

Also Read : RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

 

ఇటీవల మద్యానికి బానిసై తనను ఇబ్బంది పెడుతున్న వెంకటేష్ ను అడ్డుతోలగించుకోవాలని భావించిన ఉమా శుక్రవారం అర్ధరాత్రి చున్ని తో గొంతు నలిమి చంపేసింది. వెంకటేష్ మృత దేహాన్ని చూసిన ఇరుగు పొరుగు వెంకటేష్ తండ్రి జానయ్య కు సమాచారం ఇవ్వగా పోలీసులకు పిర్యాదు చేశారు.

 

Also Read : Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

 

సిఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమా పరారి ఉన్నట్లు చెబుతున్నారు. వెంకటేష్ కు గతంలో వివాహం కాగా మతిస్థిమితం లేని బార్య యశోద, కుమారుడు నవీన్ లు ఉన్నారు.