తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష..!

Narayanpet : మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో పి ఎస్ ఐ. గాయత్రి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆదివారం పట్టణ పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. పలు వాహనదారులకు బ్రీత్ అనలైజర్ తో డ్రంకన్ కండిషన్ తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా శిక్షణ ఎస్సై గాయత్రి మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని వాహనదారులకు సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా తో పాటు జైల్ శిక్ష విధించడం జరుగుతుందని, మద్యం సేవించిన కేసులు పునరావృత్తం అయితే వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ. ఆంజనేయులు, పోలీసులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు