Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : విద్యుత్ ఘాతంతో మామిడి చెట్లు దగ్ధం

Suryapet : విద్యుత్ ఘాతంతో మామిడి చెట్లు దగ్ధం

నడిగూడెం, మన సాక్షి :

విద్యుత్ ఘాతంతో ట్రాక్టర్ పై తీసుకెళ్తున్న గడ్డిమోపులు, మామిడి చెట్లు దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం లో చోటుచేసుకుంది. బాధితులు కత్తి నరేష్, తోడేటి శ్రీనులు తెలిపిన సమాచారం మేరకు .

 

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కత్తి నరేష్ తన పొలం నుండి సుమారు 90 గడ్డి మోపులను ట్రాక్టర్ పై లోడ్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో కరెంట్ తీగలు తగిలి విద్యుత్ ఘాతంతో పూర్తి గా గడ్డి మోపులు దగ్ధం కావడం తో పాటు పక్కనే ఉన్న తోడేటి శ్రీను మామిడి తోట కు నిప్పంటుకొని తోటలోని 4 మామిడి చెట్లు కాలిపోయాయన్నారు.

జరిగిన సంఘటన పై ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయం తో మంటలు ఆర్పీ మామిడి తోటను పూర్తిగా దగ్ధం కాకుండా ఆపగలిగారు. విద్యుత్ ఘాతంతో గడ్డిమోపులు, మామిడి చెట్లు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఇరువురు వాపోయారు.

 

ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారి కోరారు.విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది ఎల్లయ్య, కోటేశ్వరరావు, రవి, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…..

మరిన్ని వార్తలు