రైతులకు భూ న్యాయ శిబిరం

రైతులకు భూ న్యాయ శిబిరం

రైతులకు న్యాయ సలహాలు సూచనలు ఇచ్చిన నిపుణులు

తుంగతుర్తి , జూలై 02, మనసాక్షి : తెలంగాణలోని ప్రతి పల్లెలో వందల కుటుంబాలు భూ హక్కుల చిక్కుల్లో చిక్కుకొని సతమతమవుతున్న తరుణంలో, భూమి ఉన్నా, పట్టా కాకనో, ధరణికి ఎక్కకనో, నిషేధిత జాబితా వలలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న తరుణంలో రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడానికి శనివారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, గ్రామీణ న్యాయ పీఠం, మరియు లీఫ్ సంస్థల సౌజన్యంతో సోషల్ మీడియా ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాయం కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భూ చట్ట నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూమి సునీల్, తెలంగాణ తహసిల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రెవెన్యూ పత్రిక సంపాదకులు లచ్చిరెడ్డిలు మాట్లాడుతూ… ధరణి లేదా ఇతర భూమి సమస్యలు ఉన్న రైతులకు భూ న్యాయ శిబిరాలతో బాధితులకు, రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చని అన్నారు.

ALSO READBREAKING : యశ్వంత్ సిన్హా కు కెసిఆర్, కేటీఆర్ స్వాగతం

భూ సమస్యలున్న రైతులు వాటి పరిష్కారం ఎలాగో తెలియక గందరగోళంలో ఉన్న వారికి భూ న్యాయ శిబిరం ద్వారా సలహాలు సూచనలు అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని, రైతు శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సమాజం చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ మీడియా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి కరుణాకర్ దేశాయ్, న్యాయవాదులు వేలేపాటి శ్యాంసుందర్ రెడ్డి, సురేందర్, గుంతకండ్ల దయాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అబ్బగానీ పద్మ సత్యనారాయణ గౌడ్, ఉపసర్పంచ్ భాష బోయిన వెంకన్న, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవడి:

1. నేటి నుంచి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

2. కరెంట్ బిల్లులు చెల్లించం, రైతుల అల్టిమేటం – latest news