వలిగొండ : ఆదుకున్న మిత్రులు

వలిగొండ : ఆదుకున్న మిత్రులు

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఇటీవల వడదెబ్బ తగిలి మరణించిన మాజీ సర్పంచ్ వేముల మల్లయ్య దశదినకర్మ కోసం ఆయన కూతురు తోటి చదువుకున్న చిన్ననాటి మిత్రులు స్వాతి తోటి విద్యార్థులు వారి యొక్క దీన పరిస్థితిని చూసి ఎవరికి వారికి తోచినంతగా సాయం చేసి పదివేల రూపాయలు జమ చేసి వారి యొక్క కుటుంబానికి అందించి ఆసరాగా నిలిచారు.

 

తమ తోటి స్నేహితురాలు పడుతున్న ఇబ్బందులను చూసి నీకు మేమున్నామంటూ అందుకు వచ్చారు. పక్కవారికి ఏం జరిగినా చూసి చూడనట్టుగా పోయే ఈ రోజుల్లో ఇంత చిన్న వయసులోనే తోటి మిత్రురాలు ఆపదలో ఉంటే తమకు తోచినంతగా సాయం చేసి ఆదుకున్నందుకు వారిని అభినందిస్తున్నారు.

 

ఈ కార్యక్రమంలో స్వాతి మిత్రులు కంబాలపల్లి మచ్చేందర్, రాహుల్ ,లక్ష్మణ్ ,పవన్, అక్షయ ,పూజ ,దుర్గ తదితరులు పాల్గొన్నారు.