BREAKING : చెడు వ్యసనాలకు అలవాటు పడి.. సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన వారిని జైలుకు పంపింది..!

చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. చేతిలో డబ్బులు లేవు. సులువుగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలనీ భావించారు. కొందరు కలిసి ఓ ముఠాగా ఏర్పడి పశువుల దొంగతనాలకు పాల్పడ్డారు. వారి ఆలోచన చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

BREAKING : చెడు వ్యసనాలకు అలవాటు పడి.. సులువుగా డబ్బు సంపాదించే ఆలోచన వారిని జైలుకు పంపింది..!

నల్లగొండ, మన సాక్షి:

చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. చేతిలో డబ్బులు లేవు. సులువుగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలనీ భావించారు. కొందరు కలిసి ఓ ముఠాగా ఏర్పడి పశువుల దొంగతనాలకు పాల్పడ్డారు. వారి ఆలోచన చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఇటీవల తిరుమలగిరి సాగర్ మండలంలో తరచుగా పశువుల దొంగతనాలు జరుగుతున్నాయి అన్న రైతుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.

శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలుకూరు మండలం శీతల్ తండా గ్రామానికి చెందిన బానోతు మధు , తిరుమలగిరి మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన సీతారామయ్య, ఇదే గ్రామానికి చెందిన అంతటి బాలయ్య, చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామానికి చెందిన బానోతు దేవేందర్ ,చిలుకూరు మండలం శీతలతండ గ్రామానికి చెందిన భూలోత్ కృష్ణ ప్రసాద్, తిరుమలగిరి సాగర్ మండలం కొంపెల్లి కి చెందిన యనమల సిద్ధులు,లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

మంగళవారం తిరుమలగిరి సాగర్ ఎస్సై నారాయణరెడ్డితన సిబ్బందితో కలిసి శ్రీ రామ్ పల్లి మెయిన్ రోడ్డు పై వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఎంట్రా వి 50 నెంబర్ టిఎస్ 29tb 34 27 గల వాహనం హాలియా నుండి సాగర్ వెళ్తుండగా పోలీసులను చూపి వాహనాన్ని వెనుకకు తిప్పుకొని పారిపోతుండగా పోలీసులు అనుమానంతో వారిని పట్టుకుని విచారించగా పశువుల దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసిందని తెలిపారు.

వీరంతా ఎండాకాలంలో రైతులు మేత గురించి పశువులను కాపలాలేని కొట్టాలలో గ్రామం వెలుపల మేత కోసం వదిలిన సమయంలో పథకం ప్రకారం వీరు సమాచారం తెలుసుకొని టాటా ఏసీ వాహనం తో వచ్చి బలవంతంగా అందులో పశువులను ఎక్కించి కోదాడ హైదరాబాద్ సంతలకు తరలించి అమ్ముతారని వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకుంటారని తెలిపారు. తిరుమలగిరి సాగర్ ప్రాంతానికి చెందిన సీతారామయ్య, బాలయ్యలకు, చిలుకూరు మండలం కు చెందిన భానోత్ మధు ,కృష్ణ ప్రసాద్, భాను దేవేందర్ లకు పశువుల వ్యాపారంలో పరిచయం ఏర్పడి వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలని తిరుమలగిరి సాగర్ ప్రాంతానికి నాగార్జున పేట తండా చింతలపాలెం తిట్టకుండా కొంపెల్లి సపోత్ తండా గ్రామాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు డిఎస్పి తెలిపారు.

ఇట్టి కేసును చేదించిన నాగార్జునసాగర్ సిఐ బి ఎస్ఐ నారాయణరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గురునాథం కానిస్టేబుల్ నాగేష్, నాగరాజు ,హేమంత్, ప్రసాద్ ,హోమ్ గార్డ్ అంజి, శ్రీను, నర్సిరెడ్డి, శ్రీకాంతులను ,జిల్లా ఎస్పీ చందన దీప్తి అభినందించారు.