సూర్యాపేట : గిరిజన బిడ్డకు డాక్టరేట్

సూర్యాపేట : గిరిజన బిడ్డకు డాక్టరేట్

ఇస్లావత్ నీలా కు ఓయూ నుండి డాక్టరేట్ ప్రధానం

మహిళలపై వివక్షత స్థితిగతుల అంశంపై పరిశోధన

సూర్యాపేట, అక్టోబర్29, మనసాక్షి : జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల గురుకుల హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న డీఎల్ ఇస్లావత్ నీల కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి గౌరవప్రదమైన డాక్టరేట్ పట్టా శనివారం లభించింది . సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతపై, స్త్రీల స్థితిగతులు అనే అంశంపై ప్రొఫెసర్ బి. లావణ్య మిస్టర్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేసి ఆ అంశాలను పుస్తక రూపంలో పొందుపరిచారు.

ఆ పుస్తకమూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది .ప్రొఫెసర్ వైవా వాయిస్ లో భాగంగా సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో డాక్టరేట్ లభించడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసఫ్ జాహీ కాలం (1724-1948) నుండి మహిళలు అన్ని రంగాల్లో వివక్షతకు గురవుతున్నారని చిన్నతనం నుండే తాను పలు విషయాలను గ్రహించి ఈ విషయంపై పరిశోధన చేయడం జరిగిందని తెలిపారు .

మహిళల అన్ని రంగాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు .భారతదేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైనా ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడానికి గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు . ఈ సందర్బంగా డాక్టరేట్ పొందిన ఇస్లావత్ నీలా ను జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు , అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .