Gongidi Sunitha : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కు హైకోర్టు జరిమానా..!

Gongidi Sunitha : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కు హైకోర్టు జరిమానా..!

హైదరాబాద్, మన సాక్షి :

బీఆర్ఎస్ కు చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతకు హైకోర్టు జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు చూపకుండా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ కేసులో ఆలేరుకు చెందిన బో రెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. 2018 నాటి ఈ కేసులో గొంగిడి సునీత ఇప్పటివరకు కౌంటర్ పిటిషన్ వేయకపోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆమెకు హైకోర్టు పదివేల రూపాయల జరిమానా విధిస్తూ.. అక్టోబర్ మూడవ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

ALSO READ :