TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. 21 శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. 21 శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 పిఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్నెంట్ అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఫిట్మెంట్ వల్ల ఆర్టీసీ పై నెలకు 35 కోట్ల భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అయినా కూడా ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం నేను నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ALSO READ : Modi : నరేంద్ర మోడీ అందించే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎలా పొందవచ్చు..!