రోడ్డు మార్గం ద్వారా భద్రాచలానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్

రోడ్డు మార్గం ద్వారా భద్రాచలానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్

భద్రాచలం, (మన సాక్షి ప్రతినిది)

భారీ వర్షాలు, వరదలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద నీరు రికార్డ్ స్థాయిలో చేరుకుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉన్నారు. అనేక గ్రామాలు వరద నీటితో నిండిపోయాయి. లక్షలాది మంది వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఓ వైపు వరద బాధితుల సహాయార్ధం భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలంలో పర్యటించనున్నారు.

ALSO READ : మద్యం మత్తులో స్నేహితుడి హత్య – latest news

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. స్వయంగా అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులను గవర్నర్ పరామర్శించనున్నారు. ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని.. అక్కడ నుంచి రైలులో భద్రాచలం వరకూ ప్రయాణించనున్నారు.