Breaking NewsTOP STORIESవైద్యంసంక్షేమంహైదరాబాద్

TG News : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్..!

TG News : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందజేయనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల ప్రక్రియను జనవరిలో ప్రారంభించనున్నది. కొత్త ఏడాది కానుకగా రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనున్నది.

ఈ మేరకు ఈనెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించనున్నారు.

సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, భూభారతి, నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశ అనంతరం స్పష్టమైన ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు