Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. డాక్టర్లపై ఆగ్రహం..!

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం హాస్పటల్లోని పేషంట్లతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. డాక్టర్లపై ఆగ్రహం..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం హాస్పటల్లోని పేషంట్లతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫోన్ చేసి హెచ్చరించారు.

ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… హాస్పిటల్ పరిసరాలు పేషంట్స్ ఉండే వార్డులను అన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్పొరేట్ హాస్పటల్ కి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలు ఉండాలని ఆదేశాలు జారీ చేస్తుంటే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై మండిపడ్డారు.

ALSO READ : Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!