పథకాలు అర్హులకు చేరాలి.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి..!

ప్రభుత్వ పథకాల పై సచివాలయం ఉద్యో గులు, వలంటీర్లు అవగాహన కలిగి ఉండాలని, అర్హులకు ప్రభుత్వ పథకాల అందించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి బుధవారం అన్నారు.

పథకాలు అర్హులకు చేరాలి.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి..!

మెలియాపుట్టి. మనసాక్షి:

ప్రభుత్వ పథకాల పై సచివాలయం ఉద్యో గులు, వలంటీర్లు అవగాహన కలిగి ఉండాలని, అర్హులకు ప్రభుత్వ పథకాల అందించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి బుధవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎంపీడీవో కార్యాలయంలో రిఫ్రెషర్ శిక్షణ తరగతులు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పథ కాలను ఎలా అమలు చేయాలో ప్రతి ఒక్కరూ తెలు సుకోవాలన్నారు.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

ఉన్నత ఆశయంతో సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఉద్యోగులు పని చేయాలన్నారు. మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు చెరువ చేయడంలో సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.

సచివాలయం ఉద్యోగులు అనుసరించాల్సిన నిబం ధనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ రావు, వైస్ ఎంపీపీ ప్రదీప్, ఏఎంసీ చైర్మన్ అర్జునుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : ఆవాస భరోసా.. సొంత ఖర్చులతో సర్పంచ్ వెంకటరమణ చౌదరి నూతన పథకం..!