Suryapet : వికాస్ ఫార్మసీ లో గ్రాడ్యుయేషన్ డే సంబరాలు..!
Suryapet : వికాస్ ఫార్మసీ లో గ్రాడ్యుయేషన్ డే సంబరాలు..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ విద్యార్థులకుఇటీవల కాలంలో బాగా డిమాండ్ ఏర్పడిందని రాష్ట్ర డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ రామ్ కిషన్అన్నారు. శనివారం స్థానిక రాయన్ గూడెం వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మస్కూటికల్ సైన్సెస్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా 70 మంది బీఫార్మసీ, ఫార్మసీ విద్యార్థులకు బంగారు పథకాలను యూనివర్సిటీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కిషన్ మాట్లాడుతూ కరోనాకాలం తర్వాత ఫార్మసీ విద్యార్థులకు ఆరోగ్య రంగంలో ఎంతో ప్రాధాన్యత వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ విద్యార్థులు అందించిన సేవలను అనేక దేశాల అధినేతలు అభినందించారని అన్నారు.
ఈ సందర్భంగా రెటష్ బో ఆసుపత్రుల ఉపాధ్యక్షులు డాక్టర్ నీరస్ ధాబాయ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫార్మా డీ విద్యార్థులకుఅనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 200 కార్పొరేట్ ఆసుపత్రిలో ఫార్మాట్ విద్యార్థులకు క్లినికల్ ఫార్మసిస్టులుగా అవకాశాలు వచ్చాయని అన్నారు.
ఈ సందర్భంగా ఏ ఎఫ్ జి లైఫ్ సైన్స్ సీఈవో వి .హరీష్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాదులో మునప్పటి కన్న ఎక్కువ ఫార్మసీ పరిశ్రమలు వచ్చాయన్నారు. చిన్న తరహా ఫార్మసీపరిశ్రమలతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. కిస్ట్రాస్ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ జై కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తాను 2004-2008 బ్యాచ్ లో వికాస్ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేశానని తాను సొంతంగా ఒక కంపెనీని స్థాపించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. వికాస్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఎంతోమంది దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో స్థిరపడ్డారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఫార్మసీ కళాశాల సంఘం అధ్యక్షులు డాక్టర్ కే రామదాస్ కళాశాల కరస్పాండెంట్ సాదినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆడేపు రమేష్, పాలనాధికారి దేవులపల్లి వినయ్, ప్రతిష్ట ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కిషోర్, సీనియర్ అద్యాపకులు డాక్టర్ నీలమ్మ, డాక్టర్ స్వరూప, క్రీడల స్ఫూర్తి ప్రతినిధి పి. నవీన్ కుమార్, జి మహేష్, నటేష్, ఫెర్ హీన్, శైలజ, భవాని, డాక్టర్ నరసింహారావు, లిడియా, సుజాత రాంబాబు, ప్రియతమ్, మల్లెలత, తులసి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
-
TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!
-
Job mela : మార్చి 12న జాబ్ మేళా నిర్వాహణ..!
-
TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!









