సూర్యాపేట : గురుకుల పాఠశాలలో వాటర్ సంపు గోడ కూలి విద్యార్థిని మృతి
సూర్యాపేట : గురుకుల పాఠశాలలో వాటర్ సంపు గోడ కూలి విద్యార్థిని మృతి
మరో ఇద్దరికి గాయాలు
జరిగిన సంఘటన తో దిగ్భ్రాంతికి లోనైన మంత్రి
జగదీష్ రెడ్ది
మృతి చెందిన విద్యార్థి పవన్ మోతె మండలం అప్పన గూడెం వాసి
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రంలో ని బిసి గురుకుల పాఠశాలలో కూలి న వాటర్ సంపు గోడ కూలి ఒకరు మృతి ఇద్దరికి గాయాలైన సంఘటన దురదృష్టకరం అని సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ఘటన విషయం తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి లోనైన మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తో కలిసి పరామార్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహయం అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రెండుగంటల పాటు క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ఆసుపత్రిలో నే ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి వైద్య సేవలను పర్యవేక్షించారు.
ఘటన లో మృతి చెందిన మోతె మండలం అప్పన్న గూడెం కు చెందిన పవన్ అనే ఐదవ తరగతి విద్యార్థి కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
దీంతో పాటు రెండుపడకల ఇల్లుతో ,కుటుంబం లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం మృతుడి సోదరికి గురుకుల పాఠశాలలో విద్యాఅవకాశం కలిస్తున్నట్లు తెలిపారు.గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా శాలీ గౌరారం మండలం లింగోటం గ్రామానికి చెందిన గాయపడిన విద్యార్థి యశ్వంత్ ను మెరుగైన వైద్యం కోసం
హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.. నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ కు చెందిన సుశాంత్ అనే విద్యార్థి కి సూర్యాపేట లోని మెడికల్ కళాశాల ఆసుపత్రి లోనే చికిత్స జరుగుతుందన్నారు.ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరుపాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.
బాద్యులపైకఠినంగాచర్యలు తీకుంఠామని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఎక్కడా జరుగకుండా ప్రభుత్వ గురుకులాల లో ముందస్తు గా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.









