Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Gutha : బీఆర్ఎస్, బీజేపి తీరుపై గుత్తా ఫైర్..!

Gutha : బీఆర్ఎస్, బీజేపి తీరుపై గుత్తా ఫైర్..!

నల్లగొండ, మన సాక్షి :

మూసీ ప్రక్షాళన పై బిఆర్ఎస్, బిజెపి తీరుపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఫైర్ అయ్యారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నాను అన్నారు.

వాజ్ పాయ్ ప్రభుత్వం హయాం లోనే నదుల ప్రక్షాళన కు అడుగు పడిందని తెలిపారు. కేసిఆర్ కూడా రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుక వచ్చారు అని, గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయి అని,  మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనం లో గతం లోనే వేయికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు.

ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

అన్నింటికీ రాజకీయ కోణం లో విమర్శించడం సమంజసం కాదనీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని, అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలి అని సూచించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి వాటి కనుగుణంగా రోడ్లు మురికి కాలువలు వేయకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు వరదలు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నారు. అనుమతులు ఇచ్చేటప్పుడే ఎఫ్ టి ఎల్ ప్రాంతంలో అభ్యంతరం తెలిపితే ఇప్పుడు కూల్చాల్సిన పరిస్థితి ఉండదన్నారు.

గత ప్రభుత్వాలు చేసిన వాటిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది తప్ప కొత్తగా ఏమి చేపట్టడం లేదని మూసి ప్రక్షాళన పై అన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు