Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్యే

హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్యే

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

స్వతంత్ర భారత వజ్రోత్సవలు ముగింపు సందర్భంగా..చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మకాలనీ (వార్డు-6) నందు ఏర్పాటు చేసిన హరితహార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి శాసనసభ్యులు భాస్కర్ రావుపాల్గొని మొక్కలను నాటారు.

 

ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ….తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది అని అన్నారు. ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో అటవీ శాతం, గ్రీనరి శాతం ఘనంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించింది,దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు,పలు విభాగాల వార్డ్ అద్యక్షులు, మహిళలు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. మిర్యాలగూడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్..!
  2. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
  3. How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
  4. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు