గుండెపోటుతో సమ్మక్క పూజారి మృతి..!

మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) గుండెపోటుతో మృతి చెందడం తో మేడారంలో విషాదం నెలకొంది.

గుండెపోటుతో సమ్మక్క పూజారి మృతి..!

తాడ్వాయి, మన సాక్షి ప్రతినిధి :

మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) గుండెపోటుతో మృతి చెందడం తో మేడారంలో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం. మంగళవారం తెల్లవారుజామున దశరథం నిద్రలో నుంచి లేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యులను పిలిచి చూపించారు.

అప్పటికే గుండెపోటుతో మృతి చెందారని నిర్ధారించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ముగిసిన వెంటనే పూజారి మృతి చెందడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మరెన్నో బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Manasakshi