Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి..!
నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి..!
దామరచర్ల, మన సాక్షి :
నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన నర్సింహారావు, ధనుంజయరావులు పని నిమిత్తం డెక్కన్ ఫ్యాక్టరీకి వెళ్తున్నారు.
వాడపల్లి ప్రాంతంలోని హైవేపై ఎదురుగా వచ్చిన బైకర్ దాచేపల్లి మండలానికి చెందిన వ్యక్తి అతివేగంతో వీరి బైక్ ని ఢీకొనగా తీవ్ర గాయాలైన నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు దాచేపల్లి కి చెందిన యువకుడు కూడా ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రగాయాలైనా ధనుంజయరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
వారం రోజుల క్రితమే రాసి సిమెంట్ ఫ్యాక్టరీలోకి లోడింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న వ్యక్తిని లారీ ఢీకొని మృతిచెందగా.. ఇది రెండవ రోడ్డు ప్రమాదం. వాహనదారులు రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Nalgonda : నల్గొండ కాంగ్రెస్ లో కోల్డ్ వార్.. చిరిగిన డిసిసి అధ్యక్షుడి ఫ్లెక్సీలు..!
- Nalgonda : నల్గొండలో దారుణం.. తండ్రి, కొడుకులు మృతి..!
- Washing machine : వాషింగ్ మిషన్ టైంకు గడియారం టైంకు తేడా ఉంటుందా.. ఎందుకో తెలుసుకుందాం..!
- మృగశిర కార్తె రోజున చేపలు ఎందుకు తినాలి.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి.. తెలుసుకుందాం..!
- TS News : తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు..!









