Miryalaguda : అగ్నిపథ్ లో సత్తా చాటిన కె.ఎన్.ఎం. కళాశాల ఎన్.సి.సి క్యాడేట్స్..!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్ని వీర్ ఆర్మీ,అగ్నివీర్ వాయుసేనలో మిర్యాలగూడ పట్టణంలోని కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్. సి. సి క్యాడేట్లు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ ఎం. భీమార్జునరెడ్డి, ఎన్.సి.సి. సి.టి.ఓ. డాక్టర్ గుమ్మడి నరేష్ ఆ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Miryalaguda : అగ్నిపథ్ లో సత్తా చాటిన కె.ఎన్.ఎం. కళాశాల ఎన్.సి.సి క్యాడేట్స్..!
మిర్యాలగూడ, మన సాక్షి:
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్ని వీర్ ఆర్మీ,అగ్నివీర్ వాయుసేనలో మిర్యాలగూడ పట్టణంలోని కె.ఎన్.ఎం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్. సి. సి క్యాడేట్లు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ ఎం. భీమార్జునరెడ్డి, ఎన్.సి.సి. సి.టి.ఓ. డాక్టర్ గుమ్మడి నరేష్ ఆ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
కళాశాలలోని ఎన్. సి. సి. క్యాడెట్ అవిరెండ్ల సాయికుమార్ బి.ఏ. ప్రథమ సంవత్సరం చదువుతూ అగ్ని వీర్ ఆర్మీలో ట్రేడ్స్ మెన్ విభాగంలో ఎంపిక కాగా ఇతను మహారాష్ట్రలోని నాసిక్ లో శిక్షణ పొందనున్నాడు. అదేవిధంగా అగ్నివీర్ వాయుసేనలో మరో ఎన్. సి. సి. క్యాడెట్ బిఎస్సి తృతీయ సంవత్సరం చదువుతున్న డి. భవానీ శంకర్ కర్ణాటకలోని బెల్గాం క్యాంపులో శిక్షణ పొందనున్నాడు.
వీరిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు తమ ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్, సి.టి.ఒ. ఆకాంక్షించారు. కళాశాల ఎన్.సి.సి. క్యాడేట్స్ భారత ఆర్మీ, వాయుసేనలో ఉద్యోగాలు పొందడం పట్ల కళాశాలలోని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.