డీలర్లకు వ్యవసాయ అధికారిని హెచ్చరిక.. ఎరువులు, విత్తనాల దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రము లోని రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు ఉంటాయని ముదిగొండ మండల వ్యవసాయ అధికారిణి (ఎ ఓ) సరిత హెచ్చరించారు.

డీలర్లకు వ్యవసాయ అధికారిని హెచ్చరిక.. ఎరువులు, విత్తనాల దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!
ముదిగొండ, (మన సాక్షి):
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రము లోని రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు ఉంటాయని ముదిగొండ మండల వ్యవసాయ అధికారిణి (ఎ ఓ) సరిత హెచ్చరించారు. మండల కేంద్రంలోని ‘గ్రోమోర్ సెంటర్’ను పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణంలోని విత్తనాల నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకూ విక్రేతలు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, దుకాణంలోని నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
మార్కెట్లో ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే వ్యవసాయ అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు..









