మిర్యాలగూడ : ప్రమాదకరంగా హై వే..!

మిర్యాలగూడ : ప్రమాదకరంగా హై వే..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మిర్యాలగూడ మండలం జంకుతండ వద్ద వాజీరాబాద్ మేజర్ దగ్గర కోదాడ -జడ్చర్ల హై వే-167 ప్రమాదకరంగా మారింది.

 

హై రహదారి నుండి ఇండస్ట్రియల్, జంకుతండకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయగా రహదారి దాటేటప్పుడు వేగంగా వస్తున్నా వాహనాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు దాటే ప్రదేశంలో కనీసం స్పీడ్ బ్రేకర్లు కానీ ప్రమాద హెచ్చరిక బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు.

 

దింతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా అనేక మంది గాయాల పాలు అయ్యారు.రహదారులు, భవనాలు శాఖ, హై వే అధికారులు తక్షణం స్పందించాలని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్ కోరారు.