హిట్ అండ్ రన్ జీవో ను రద్దు చేయాలి

డ్రైవర్లకు ఇబ్బందిగా మారిన హిట్ అండ్ రన్ జీవోను రద్దు చేయాలని రైస్ మిల్ డిసిఎం డ్రైవర్లు బుధవారం ధర్నా చేశారు.ఖమ్మం రోడ్ లోని ఈదురుగూడెం చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు.వీరి ఆందోళనలకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.

హిట్ అండ్ రన్ జీవో ను రద్దు చేయాలి

డ్రైవర్లు ధర్నా…జూలకంటి మద్దతు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

డ్రైవర్లకు ఇబ్బందిగా మారిన హిట్ అండ్ రన్ జీవోను రద్దు చేయాలని రైస్ మిల్ డిసిఎం డ్రైవర్లు బుధవారం ధర్నా చేశారు.ఖమ్మం రోడ్ లోని ఈదురుగూడెం చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు.వీరి ఆందోళనలకు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు

దానివలన డ్రైవర్ల జీవనం కష్టతరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదం జరిగితే 10 ఏళ్ళు జైలు శిక్షతోపాటు 10 లక్షల జరిమానా విధించే విధంగా చట్టం చేయడం సరి కాదన్నారు. ప్రమాదాలు కావాలని ఎవరు చేయరని అనుకోని సందర్భాల్లో ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగితే డ్రైవర్ను బాధ్యులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

ALSO READ : శబరిలో మృతి చెందిన సూర్యాపేట వాసి.. ఆదుకున్న అయ్యప్ప ధర్మ ప్రచార సభ..!

ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్ల డ్రైవర్లు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే ప్రభుత్వం హిట్ అండ్ రన్ జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, తిరుపతి రామ్మూర్తి, యూనియన్ అధ్యక్షులు నాగటి జోసెఫ్, అనంతుల రాజేష్, పుట్టల బాబు, జాగటి సైదులు, బాబా, కొరటికల్ రవి, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!