Holidays : బిగ్ బ్రేకింగ్.. విద్యార్థులకు అలర్ట్.. సెలవుల పొడిగింపు..!

Holidays : బిగ్ బ్రేకింగ్.. విద్యార్థులకు అలర్ట్.. సెలవుల పొడిగింపు..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వర్షాల కారణంగా ఇళ్లలో నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు లేవు.

 

తెలంగాణ ప్రభుత్వం ముందుగా రాష్ట్రవ్యాప్తంగా 20, 21వ తేదీ న విద్యాసంస్థలు (కళాశాలలు, పాఠశాలలు, కార్యాలయాలకు) సెలవులు ప్రకటించిన విషయం విధితమే. కాగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా 21, 22వ తేదీలలో కూడా జిహెచ్ఎంసి పరిధిలో సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దాంతో ఆమె శనివారం కూడా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శనివారం కూడా ఆమె సెలవు ప్రకటించారు. విద్యార్థులకు గురు, శుక్రవారాలతో పాటు శనివారం కూడా సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలు సోమవారం తెరుచుకోనున్నారు.

 

ALSO READ : 

1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!