Siddeshwara Temple : పురాతన సిద్దేశ్వర ఆలయంలో హుండి చోరీ..!
Siddeshwara Temple : పురాతన సిద్దేశ్వర ఆలయంలో హుండి చోరీ..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని శివారులోని అతి పురాతనమైన శైవక్షేత్రం, మినీ కాశీగా పేరుగాంచిన శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ఆలయ హుండీ పైభాగం పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నం చేశారని అర్చకులు జై కిషన్ మహరాజ్, శివ స్వామి తెలిపారు. అతి పురాతనమైన పనవాటి లింగం పెకిలించడంతో ఏదైనా అరిష్టం జరుగుతుందో అని గ్రామస్థులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్టాడుతూ.. ఉదయం ఆలయానికి వచ్చి చూడగా ఆలయంలో ఉన్న హుండీ పైభాగం పగలగొట్టి ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కంగ్టి ఎస్ఐ విజయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు.
అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. గతంలో 3,4 సార్లు ఆలయంలో హుండీ చోరీ జరగడంతో గ్రామస్తులు ఇటీవల ఆలయ ఈఓ, పాలక వరానికి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని చెప్పిన వారం రోజులకే చోరీ యత్నం జరగడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
LATEST NEWS :
సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!
మాకు లేదా రుణమాఫీ.. విధివిధానాలు రానప్పుడు సమావేశం ఎందుకు, రైతుల ఆందోళన..!
Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!
Job Mela : టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఆగస్టు 21న జాబ్ మేళా..!
దర్జాగా కారులో వచ్చి.. రాత్రికి రాత్రే షాపులన్నీ దోచేశారు, సీసీ పూటేజీలో రికార్డ్..!









