Ice cream: ఆకట్టుకునే స్టిక్కర్లతో నకిలీ ఐస్ క్రీములు… పట్టుకున్న పోలీసులు
Ice cream: ఆకట్టుకునే స్టిక్కర్లతో నకిలీ ఐస్ క్రీములు… పట్టుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు , మనసాక్షి:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలో నకిలీ ఐస్ క్రీమ్ ముఠాను శంషాబాద్ ఎస్ఓటి, పోలీసులు గుర్తించారు. పట్టణ కేంద్రంలో నకిలీ ఐస్ క్రీములు తయారు చేస్తున్న మేఘ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి భారీగా నకిలీ ఐస్ క్రీమ్లను వాహనాలను సీజ్ చేశారు.
ఎస్ఓటి శంషాబాద్ జోన్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై రాజేశ్వరరెడ్డి,ఏఎస్ఐ రవీందర్ రెడ్డి సిబ్బంది తో కలిసి నకిలీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పై దాడులు నిర్వహించారు.రూ.10 లక్షల విలువ చేసే వివిధ రకాల ఐస్ క్రీములు పలు వాహనాలను సీజ్ చేశారు.
ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న కంపెనీ 2010 సంవత్సరములోనే ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాయి. 2010 సంవత్సరం నుండి మళ్ళీ రెన్యూవల్ చేసుకోకుండా, కనీస నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని పోలీసులు తెలిపారు.
అపరిశుభ్రమైన బోరు నీళ్లతో నకిలీ ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకర్షనీయమైన స్టిక్కరింగ్ చేసి మారుమూల గ్రామీణ ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటనలో ఆమనగల్లు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఎర్రబిక్య తండా కు చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సుందరయ్య పేర్కొన్నారు.












