Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఖమ్మం జిల్లాజాతీయంజిల్లా వార్తలుతెలంగాణ

Independence Day : ఢిల్లీ లోని ఎర్రకోట వేడుకల్లో మన గురుకుల విద్యార్ధిని.. అరుదైన గౌరవం..!

Independence Day : ఢిల్లీ లోని ఎర్రకోట వేడుకల్లో మన గురుకుల విద్యార్ధిని.. అరుదైన గౌరవం..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఢిల్లీలోని ఎర్రకోట లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది.  గురుకుల పాఠశాల విద్యార్థిని గ్రేషిత ఎర్రకోట లోని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంది. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని సింగారెడ్డిపాలెం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధిని వి.గ్రేషిత కు గౌరవం దక్కింది.

ఇటీవల ప్రేరణ కార్యక్రమంలో స్థానం సాధించారు. గుజరాత్ లోని ప్రధాని మోడీ నివాసమైన వడ్నగర్ లో పది రోజుల పాటు శిక్షణ పొందారు. ఢిల్లీ లోని ఎర్రకోటలో జరిగే వేడుకలకు రావాలని రాష్ట్రం నుంచి గురుకుల పాఠశాల విద్యార్ధిని గ్రేషిత కు మాత్రమే అహ్వనం పంపారు.

ఈ మేరకు స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి సదరు విద్యార్దిని తో పాటు ఓ ఉపాధ్యాయురాలును పంపించారు. .గురువారం జరిగిన ఎర్రకోట స్వాంత్ర దినోత్సవ వేడుకలను తిలకించారు.

ఈ సందర్భంగా గ్రేషిత మాట్లాడారు… తనకు ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకలలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వయంగా ఢిల్లీలో ప్రధాని మోడీ ఎర్రకోట పై జెండా ఎగురవేసే సమయంలో ఆనందంగా ఉందన్నారు. నాజన్మ ధన్యమైందని అన్నారు.

ఈ సందర్భంగా గురుకుల సంస్థ జోనల్ ఆఫీసర్ కె.స్వరూపరాణి, ప్రిన్సిపాల్ పద్మావతి, సిబ్బంది పాకనాటి కన్నారెడ్డి తదితరులు అభినందించారు.

ALSO READ : 

మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!

MIRYALAGUDA : 15వేల మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..!

మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!

LRS : ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం..!

 

మరిన్ని వార్తలు