Miryalaguda : చేనేత కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు..!
Miryalaguda : చేనేత కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
చేనేత కార్మికులకు, పేద పద్మశాలి కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించనున్నట్లు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఫంక్షన్ హాల్ లో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి సంఘం నూతన భవనానికి త్వరలో భూమిని కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా మార్కండేయ స్వామి దేవాలయానికి కూడా స్థలాన్ని కేటాయించి అభివృద్ధికి నిధులు కూడా కేటాయించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సంఘ కన్వీనర్ భవండ్ల పాండు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జల్లా రాంబాబు, రాంప్రసాద్, మిర్యాల కృష్ణయ్య, ఎర్రమధ రాములు, రాపోలు వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ చిలుకూరు సక్కుబాయి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, సిపిఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, బిజెపి నాయకులు హనుమంత రెడ్డి, టిడిపి నాయకులు బంటు వెంకటేశ్వర్లు, చెరుపల్లి చంద్రమౌళి, చిలుకూరి బాలు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Wonder Girl : అతి చిన్న వయసులోనే ఇండియన్ గర్ల్ కార్తికేయన్ ప్రపంచ రికార్డ్.. 16ఏళ్ళ వయసులోనే 7 ఎత్తైన పర్వతాలు..!
-
Cell Phones : కాలేజీల్లో సెల్ ఫోన్ ఎంట్రీపై ఉన్నత విద్యామండలి కొత్త రూల్..!
-
Social Media : సోషల్ మీడియా మాయలో మీ మెదడు పుచ్చిపోయిందా.. బ్రెయిన్ రాట్తో జాగ్రత్త..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!









