Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : 29న నల్గొండలో దీక్ష దివస్..!

Nalgonda : 29న నల్గొండలో దీక్ష దివస్..!

నల్లగొండ, మన సాక్షి :

ఈనెల 29న నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ నిర్వహిస్తున్నట్లు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రమావత్ రవీంద్ర కుమార్ మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి . మాజీ శాసనసభ్యులు.. కంచర్ల భూపాల్ రెడ్డి చిరుమర్తి లింగయ్య కల్లుగీత రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య తో కలిసి మాట్లాడారు.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడంతో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అప్పటి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి వచ్చి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని తెలిపారు
అందుకే ఈనెల 29వ తేదీన., పెద్ద ఎత్తున నల్లగొండలో దీక్ష దివస్ఏర్పాటు చేస్తున్నామని దీనికి సన్నాహకంగా ఈనెల 26వ తేదీన. మధ్యాహ్నం రెండు గంటలకు నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి నల్గొండ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు,, అనుబంధ సంఘాల ప్రతినిధులు. ముఖ్య కార్యకర్తలు తప్పకుండ ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై అమానుషంగా ప్రవర్తిస్తుందని.. లగచర్ల గిరిజన రైతులపై… అక్రమ కేసులు బనాయించి… ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని ప్రభుత్వం రైతులపై ధమనకాండను మానుకోవాలని, హితవు పలికారు.

మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చివాటి నెరవేర్చలేక హైదరాబాదులో హైడ్రా డ్రామా నడుపుతున్నారని.. ముఖ్యమంత్రి పక్క రియల్టర్ గా పని చేస్తున్నారని ఎంతో కష్టపడ హైదరాబాదును అభివృద్ధి చేస్తే నేడు హైదరాబాద్ బ్రాండ్ సర్వనాశనం చేశారని, రియల్ ఎస్టేట్ బిజినెస్ కుదేలైందని ప్రభుత్వ తీరు వల్ల హైదరాబాదులో భూములు కొనే వారు అమ్మేవారు లేకుండా పోయారని ఇది తెలంగాణ రాష్ట్రానికి భారీ నష్టం కలగజేస్తుంది అన్నారు.

కెసిఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనిఈనెల 29న దీక్షా దివస్ ఏర్పాటు చేశామని ఈ సభలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, కౌన్సిలర్ మారవుని గణేష్.. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, కొండూరు సత్యనారాయణ,

జమాల్ ఖాద్రి.. గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మైనం శ్రీనివాస్, బడుపుల శంకర్ కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ,బొజ్జ వెంకన్న మాజీ సర్పంచ్ జంగయ్య, శంషుద్దీన్, గంజి రాజేందర్, ఊట్కూరు సునంద రెడ్డి, మెండు చంద్రశేఖర్ రెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు