Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు.. అంతా కల్తీ మయంగా గుర్తింపు.. వ్యాపారులకు నోటీసులు..!

Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర తనిఖీలు.. అంతా కల్తీ మయంగా గుర్తింపు.. వ్యాపారులకు నోటీసులు..!

నల్గొండ, మనసాక్షి

ఆహార పరిరక్షణ ప్రమాణాల ప్రాముఖ్యతను ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో, యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు, నల్గొండ ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో (హైదరాబాద్ రోడ్ ఎస్పీ కార్యాలయం నుండి బైపాస్ వరకు) మార్గంలో ఉన్న 13 హోటల్, టీ స్టాల్ స్థావరాలపై టీ పొడి పాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారణ పరీక్షల కు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టారు.

ఈ తనిఖీల్లో హోటళ్లు, టీ స్టాల్స్, కాఫీ షాపులు వంటి ఆహార విక్రయ కేంద్రాల్లో నమూనాలు సేకరించబడ్డాయి. డ్రైవ్‌లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఉపయోగించి తక్షణ పరీక్షలు నిర్వహించబడ్డాయి.  ఈ డ్రైవ్‌లో రాఘవేంద్ర భవన్, ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని కిచెన్, రాజస్థాన్ టీ స్టాల్, చార్మినార్ కేఫ్, బెల్లం టీ, టీ టైమ్, అఫీజ్ పాన్ షాప్, జాగరి అడ్డా సహా పలువురు రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న టీ స్టాళ్లను పరిశీలించారు. వాటిలో నుండి సేకరించిన టీ పొడి మరియు పాల నమూనాలను మొబైల్ ల్యాబ్‌లోనే వెంటనే పరీక్షించారు.

తనిఖీల్లో గుర్తించబడిన టీ పౌడర్‌కు ఫిల్టర్ పేపర్ స్పాట్ టెస్ట్ నిర్వహించగా, కొన్ని నమూనాల్లో ఆహార పరిరక్షణ ప్రమాణాల లోపాలు ఉన్నట్లు గుర్తించబడింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని వ్యాపారస్థుల సమక్షంలో ధ్వంసం చేయించబడ్డాయి. దీనిపై సంబంధిత వ్యాపారస్థులను విచారించగా అవగాహనా లోపంతో వాడుతున్నట్లు గుర్తించి వారికీ నోటీసులు జారీ చేసి, కల్తీ పదార్థాల వాడకంపై అవగాహన కల్పించబడింది.

ఆహార పరిరక్షణ ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు. దీర్ఘకాలిక వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీయవచ్చని ప్రజలకు వివరించారు. పాలను మిల్కోస్కాన్ పరికరంతో పరీక్షించగా, కొన్ని నమూనాలు సబ్‌స్టాండర్డ్‌గా (నాణ్యత ప్రమాణాలకు లోపంగా) ఉన్నట్లు తేలింది. వాటినీ వెంటనే వినియోగం నుండి తొలగించి ధ్వంసం చేయించడంతో పాటు, బాధ్యులకు సూచనలు మరియు నోటీసులు అందించబడ్డాయి.

జిల్లా ఆహార పరిరక్షణ విభాగం, కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉండటంతో, వ్యాపారులు నిబంధనలు పాటించాలని అవగాహనా కల్పించారు. ప్రజలు కూడా అనుమానాస్పదమైన ఆహార ఉత్పత్తులపై జిల్లా ఆహార పరిరక్షణ శాఖకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆహార పరిరక్షణను బలోపేతం చేయడం కోసం జిల్లాలో ఈ తరహా డ్రైవ్‌లు కొనసాగుతాయని యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీమతి వి. జ్యోతిర్మయి తెలిపారు. తనిఖీలలో  ఎన్. శివ శంకర్ రెడ్డి – ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఎం. వెంకటపతి – ల్యాబ్ టెక్నీషియన్, రమేష్ – శాంపుల్ అసిస్టెంట్, ఏ. మహేశ్ – డ్రైవర్, సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. NSE : ఎన్‌ఎస్‌ఈకి మంగళవారం ఎక్స్‌పైరీకి సెబీ ఆమోదం..!

  3. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!

  5. District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

మరిన్ని వార్తలు