Crime News : లవ్ చేస్తావా, పోటోలు వైరల్ చేయమంటావా.. ఇంటర్ కళాశాలలో కామాంధుడు..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె-అంగళ్లు మార్గంలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని(17)ని పీఈటీ వేధిస్తుండడంతో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ముదివేడు ఎస్ఐ మల్లిఖార్జున రెడ్డి ఆదివారం తెలిపారు.

Crime News : లవ్ చేస్తావా, పోటోలు వైరల్ చేయమంటావా.. ఇంటర్ కళాశాలలో కామాంధుడు..!

పీఈటీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

మదనపల్లి, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా మదనపల్లె-అంగళ్లు మార్గంలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని(17)ని పీఈటీ వేధిస్తుండడంతో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ముదివేడు ఎస్ఐ మల్లిఖార్జున రెడ్డి ఆదివారం తెలిపారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… మదనపల్లెకు చెందిన భాస్కర్ (33) అంగళ్లు మార్గంలోని ఓ జూనియర్ ఇంటర్ కళాశాలలో ఏడాదిగా పీఈటీగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులు పీఈటీ క్లాసులకు వెళితే అదోలా చూసేవాడు.

ఫీజుల పేరుతో రమ్మని లవ్ చేయమనేవాడు. ఈ క్రమంలో ఇతను ఆ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు యత్నించాడు. అంతేకాకుండా ప్రేమించాలని వేదించేవాడు. పీఈటీ అన్న భయంతో బయటకు చెప్పుకునే వారు కాదు. చాటుగా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడు. లవ్ చేయక పోతే ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించే చేవాడు.

ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!

డబ్బులు కూడా లాగేవాడు . ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు. ఆపై అంకుల్ వయస్సు. అయినా ప్రేమ పేరుతో వెంట పడి వేదించేవాడు. పెళ్లి కూడా చేసుకుంటానని అనేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో విధిలేని పరిస్థితిలో ఆ అమ్మాయి. విషయాన్ని ఇటీవల తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారించిన పోలీసులు పీఈటీ భాస్కర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై కళాశాల నిర్వాహకులను విచారించగా పీఈ టిని ఇదివరకే ఉద్యోగం తొలగించినట్లు తెలిపారు.

ALSO READ : మిర్యాలగూడ : నకిలీ మందుల తయారీ గుట్టు రట్టు.. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల ఆకాష్మిక తనిఖీలు పట్టుబడ్డ వైనం..!