Invitaion : గవర్నర్‌ ను ఆహ్వానించిన మంత్రి దామోదర్‌..!

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సోమవారం రాజ్‌ భవన్‌ లో రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై ని కలిశారు.

Invitaion : గవర్నర్‌ ను ఆహ్వానించిన మంత్రి దామోదర్‌..!

అందోలు, మనసాక్షిః

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సోమవారం రాజ్‌ భవన్‌ లో రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై ని కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 29న తన కూతురు త్రిష, మణికంఠ ల వివాహ ఆహ్వాన పత్రికను మంత్రి గవర్నర్‌ కు మంత్రి అందజేసి ఆహ్వనించారు.

29న హైదరాబాద్‌ లోని జే ఆర్‌ సి కన్వెన్షన్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్‌ లో వివాహం జరగనుండగా, మార్చి 3వ తేదిన∙సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గ పరిధిలోని చౌటపూర్‌ మండలం సింగూర్‌ చౌరస్తాలో సుల్తాన్‌ పూర్‌ వద్ద వివాహ రిసెప్షన్‌ జరుగనుంది. అందుకుగాను నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్యులకు రిసెప్షన్‌ కార్డులను అందజేశారు. వేలాదిగా తరలివచ్చే కార్యకర్తలు, నాయకుల కోసం 30 ఎకరాలలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ALSO READ : VH : సీఎం రేవంత్ పై విహెచ్ కీలక వ్యాఖ్యలు..!