Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

VH : సీఎం రేవంత్ పై విహెచ్ కీలక వ్యాఖ్యలు..!

VH : సీఎం రేవంత్ పై విహెచ్ కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి ,తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హెచ్ ( వి. హనుమంతరావు) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేసి తీరుతానని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.

ALSO READ : Telangana : బతికున్న రైతులను చంపేశారు.. రైతుబంధు, రైతు బీమాలో రెండు కోట్లు స్వాహ..!

‘ రేవంత్ పై నాకు నమ్మకం ఉంది. నేనేం తప్పు చేశాను. నన్ను ఎందుకు పక్కకు పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు అడిగితే. నాలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులని తొలగించాలి. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది.

మొన్నటి ఎన్నికల్లో రేవంత్ నేనే ఎక్కువ తిరిగామ మిగతా నాయకులంతా నియోజకవర్గంకే పరిమితమయ్యారు. వయసులో ఉన్నానని నాకు సీఎం పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు. రేవంత్ కు నేను సపోర్ట్ చేశాను’. ఇకపై కూడా చేస్తాను.. అని వ్యాఖ్యానించారు.

ALSO READ : Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో మూడు రోజులే ఛాన్స్..!

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని.. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు తెలిపారు. ఖమ్మం నుంచి పోటీచేయాలని అక్కడ క్యాడర్ అడుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉన్నారా..? అని ప్రశ్నించారు. దేశంలో తన కంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా.. అని విహెచ్ పేర్కొన్నారు.

 

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.

మరిన్ని వార్తలు