సూర్యాపేట : ప్రత్యేక ఆకర్షణగా మంత్రి జగదీష్ రెడ్డి సైకత శిల్పం

సూర్యాపేట : ప్రత్యేక ఆకర్షణగా మంత్రి జగదీష్ రెడ్డి సైకత శిల్పం

సూర్యాపేట , మనసాక్షి :

రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ మినీ ట్యాన్క్ బండ మీద రూపొందించిన శాండ్ ఆర్ట్ తో కూడిన సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఉద్యమ కాలం నుండి మంత్రి జగదీష్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్న జిల్లా శంకర్,కల్లెట్లపల్లి
శోభన్ బాబు లు ఎన్నో వ్యయ ప్రయాసాలకొనర్చి ఈ సైకత శిల్పాన్ని తయారు చేయించాడు.

 

వర్షం పడుతుండడం తో ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక పందిరి వేయించి దానికింద ఇది రూపొందించారు.
నల్లగొండ జిల్లా టి ఆర్ ఎస్ బి కో ఆర్డినేటర్ జిల్లా శంకర్,కల్లెట్లపల్లి శోభన్ బాబు ఇందు కోసం విజయవాడ నుండి శాండ్ ఆర్ట్ నిపుణులు బాలాజీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆరుగురు కళాకారులు దీనిని రెండు రోజుల వ్యవధిలో రూపొందించినారు.

 

ALSO READ : 

1. Ktr : కేటీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దారిలోనే రోడ్డు ప్రమాదం.. ఆయన ఏం చేశారో..! ( వీడియో వైరల్)

2. SBI : ఎస్ బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్ తీసుకునే వారికి మరింత ఊరట..!

3. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

4. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

 

ఇందు కోసం రెండు లారీల ఇసుకను వినియోగించినట్లు ఆర్టిస్ట్ వర ప్రసాద్ వెల్లడించారు. సూర్యాపేట అభివృద్ధి సూరీడు జగదిషుడు అంటూ ఇసుకతోటే రాయించి అద్భుతమైన మంత్రి జగదీష్ రెడ్డి సైకత శిల్పం మంత్రి జగదీష్ రెడ్డి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్ తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ ల చిత్రాలను ఇందులో పొందు పరిచారు. ఉదయం నుండి వేలాది మంది పట్టణ ప్రజలు ఈ శిల్పాన్ని సందర్శించగా సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులు ఈ శిల్పాన్ని సందర్శించి ఎంతో ఓపికతో రూపొందించిన జిల్లా శంకర్,శోభన్ బాబు లను అభినందించారు.