సూర్యాపేట : కాంగ్రెస్ లో విలీనం అవుతున్న అసమతి కౌన్సిలర్..!

గత రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అసమతి కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాదులో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాల ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో మొత్తం 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటిలో చేరనున్నారు.

సూర్యాపేట : కాంగ్రెస్ లో విలీనం అవుతున్న అసమతి కౌన్సిలర్..!

కాంగ్రెస్ గూటికి అసమతి కౌన్సిలర్లు.. బిటలు బారుతున్న బి ఆర్ ఎస్

దామోదర్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ సమక్షంలో నేడు కాంగ్రెస్ లొ చేరిక..!

సూర్యాపేట, మనసాక్షి :

గత రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అసమతి కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాదులో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాల ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో మొత్తం 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటిలో చేరనున్నారు.

అయితే వారి చేరికలతో సూర్యాపేట బి ఆర్ ఎస్ పార్టీ కోటకు బిటలు బారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వార్డులలో పార్టీ క్యాడర్ను సైతం ఒకేసారి చేరుదామని అనుకున్న రేపు గురువారం సూర్యాపేట మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు.

అయితే ఈ సమావేశాలకు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లు కాంగ్రెస్ సభ్యులు గానే హాజరుకావాలని భావించిన తరుణంలో హుటాహుటిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిన నేపథ్యంలో బుధవారం హైదరాబాదులో కౌన్సిలర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ALSO READ : నల్లగొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా కౌంటర్..!

తర్వాత పలు వార్డులలో కౌన్సిలర్లు వారి క్యాడర్ను సంప్రదించి సమావేశపరచి పెద్ద ఎత్తున సూర్యాపేటలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం చివరికి బిఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్ల రాజీనామా అంశం తెరపైకి వచ్చి ఇప్పుడు వారందరూ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల ముందు అందులోకి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న ఈ తరుణంలో మునిసిపాలిటీ నుండి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్లడం అధిష్టానానికి మింగుడు పడని విషయంగా పరిశీలకులు భావిస్తున్నారు.

ALSO READ : నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్ వినూతన నిరసన..!

అందులోటి మునిసిపాలిటీ ఎన్నికలు కేవలం ఏడాదిలోపే జరగనున్న ఇతరుణంలో కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం బి ఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపుకు లోనైందని చెప్పాలి. అసలే అధికారం కోల్పోయిన ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని అంటున్నారు బి ఆర్ ఎస్ అభిమానులు.