మేళ్లచెరువు : తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం

మేళ్లచెరువు : తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం

విద్యుత్ అదికారుల అలసత్వమే కారణం ..?

మేళ్లచెరువు, అక్టోబర్15, మనసాక్షి: విద్యుత్ హై టెన్షన్ వైరు అకస్మాత్తుగా తెగి కిందపడటం, ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.మండల కేంద్రం లోని రేవూరు రోడ్ సమీపంలో లోని కరెంట్ పోల్ నుండి మెయిన్ లైన్ తెగి అక్కడే ఉన్న ద్వి చక్ర వాహనాల పై పడింది.

ALSO READ : వేములపల్లి : భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు

దీంతో పరిసర ప్రజలు ఉలిక్కిపడ్డారు. జరిగిన ఘటనపై వెంటనే స్థానిక విద్యుత్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయగా,సిబ్బంది ఆలస్యంగా స్పందించడం తో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు కు ఇన్ చార్జ్ ఏఈలే కొన్నాళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్ చార్జ్ లు కూడా అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కింద స్థాయి విద్యుత్ సిబ్బంది వచ్చిన ఫిర్యాదులపై స్పందించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ALSO READ : ఫ్లాష్..  ఫ్లాష్..  బుచ్చిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం

కొంత కాలంగా గ్రామంలో అకారణ విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. కొత్తగా ట్రాన్స్‌ఫర్ పై వచ్చిన సిబ్వందే అధికంగా ఉండటం, వారికి గ్రామంపై అవగాహన లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది.