వేములపల్లి : భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు

భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు

చిత్రపరక వాగుకు వరద పోటు

వేములపల్లి, అక్టోబర్ 15, మన సాక్షి ; నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పోతుండగా వీధులన్నీ చిత్తడిగా మారాయి. మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలోకి మోకాళ్ళ లోతు నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు.

బోరుబావుల ఆధారంగా సాగుచేసిన పంట పొలాలు వర్షపు దాటికి నేల వాడడంతో చేతికి అందిన పంట ఎక్కడ నీటి పాలవుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతుండగా లోతట్టు ప్రాంతాలలోని పత్తి చేలు సైతం నీటిలో కుళ్ళిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శేట్టిపాలెం సమీపంలోని చిత్రపరక వాగుకు వరద పోటెతడంతో గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు అంతరాయంగా మారింది వర్షపు దాటికి నేల వాలిన పంటపొలాలను ప్రభుత్వం సర్వే చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.