వామ్మో… ఆ వీడియో చూస్తుంటేనే , జస్ట్ మిస్ (వీడియో వైరల్ )

వామ్మో… ఆ వీడియో చూస్తుంటేనే , జస్ట్ మిస్ (వీడియో వైరల్ )

ఇంటర్నెట్, మనసాక్షి : రైలు ప్రయాణికుల్లో ఎక్కువమంది పేద, మధ్య తరగతి వారే ప్రయాణం చేస్తుంటారు. వాళ్లలో కొంతమంది సమీప గ్రామాలలో రైల్వేస్టేషన్ లో దిగి క్రాసింగ్ వద్ద అడ్డదిడ్డంగా రైలు పట్టాలు దాటి ప్రయాణాలు చేస్తుంటారు . అలా దిగి వెళ్లే సందర్భాలలో అప్రమత్తంగా లేక అనర్ధాలు జరుగుతుంటాయి. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తుంటేనే వామ్మో జస్ట్ మిస్ అని అనేలా అనిపిస్తుంది. ఆ వైరల్ వీడియోను చత్తీస్గడ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అవనీష్ శరన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ASLO READ : నల్గొండ జిల్లాలో విషాదం, నీటి తొట్టిలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి – latest news

ఆ వీడియోలో ఏముందంటే క్రాసింగ్ కారణంగా సిగ్నల్ పడటంతో రైల్వే స్టేషన్ రాకముందే ఒక ట్రైన్ ఆగింది. దాంతో కొందరు ప్రయాణికులు రైలు దిగి పక్కన ఉన్న ట్రాక్ మీదకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సామాన్లు తీసుకుని కొందరు అటు పక్కకి వెళ్లిపోయారు. మరికొందరు త్వరితగతిన వెళ్లే పక్క ట్రాక్ రైలు వచ్చి వెళ్ళాక వెళ్ళిపోదామని ఎక్కిన రైల్లో నుంచి దిగి ఆ రైలు పక్కనే కూర్చున్నారు. వీరిలో ఒక నడి వయసు మహిళా గందరగోళానికి లోనై అట్టుపక్కకు వెళ్దాం అనుకుంది. కాగా అటు పక్కకు వెళ్లి మళ్లీ ఒక సామాను ఉన్న సంచి కోసం ఇటు పక్కకు వచ్చే ప్రయత్నించింది. సెకండ్ల వ్యవధిలోనే ఆమె ట్రాక్ దాటుతున్న గ్రామంలో రైలు దూసుకొచ్చింది. ఆమె అదృష్టం బాగుంది. సెకండ్ల ముందు ట్రాక్ దాటడంతో ప్రాణాలు దక్కాయి. లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసేవే.

ALSO READ : పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కన్నుమూత

ఈ ఘటన ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అవనీష్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయవద్దని హితువు పలుకుతున్నారు.