Kalyana Laxmi : పేదింట్లో కళ్యాణ కాంతులు ….!
పేదింట్లో కళ్యాణ కాంతులు ….!
ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి
కంగ్టి, మన సాక్షి :
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదల ఇంట్లో కళ్యాణ కాంతులు వెలుగోందుతున్నాయని ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు.
Also Read : PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు, సరుబై , శోభ ,నరసవ్వ, కు కళ్యాణ లక్ష్మి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదవారికి పెండ్లి చేయడానికి అప్పులు కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!
ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేయడానికి కష్టపడుతున్న పేదవారిని చూసి సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగారాం మండల ఉపాధ్యక్షులు సాయ గౌడ్ ,బిఆర్ఎస్ నాయకులు రవీందర్ నాయక్ ,సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.









