ఆ ఊరిలో కనుమ రోజు భోగి.. తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం కోసమాల గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమ రోజు భోగి జరుపుకునే సంప్రదాయాన్ని గ్రామస్తులు తరతరాల నుంచి నేటికీ కొనసాగిస్తున్నారు .

ఆ ఊరిలో కనుమ రోజు భోగి.. తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం..!

మెలియాపుట్టి. మన సాక్షి:

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం కోసమాల గ్రామంలోని దేవాంగుల వీధిలో కనుమ రోజు భోగి జరుపుకునే సంప్రదాయాన్ని గ్రామస్తులు తరతరాల నుంచి నేటికీ కొనసాగిస్తున్నారు .

గ్రామంలో దేవాంగాల వీధిలో నేత కార్మికులు ఎక్కువ మంది ఉండేవారు అందువలన సంక్రాంతి రోజు వరకు తమ బట్టలు నేతతో బిజీగా ఉండేవారు. అందువలన వీరికి భోగి చేసుకునే అవకాశం ఉండేది కాదు . నేత బట్టలు గ్రామాలలో విక్రయించేవారు.

ALSO READ : Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!

దీనితో భోగి రోజు భోగి చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పటికీ కూడా ఆ వీధిలోని ప్రజలు కనుమ రోజే బోగీ పండుగను మంగళవారం జరుపుకొని సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. భోగి మంటలలో డివిఎన్ సురేష్ , పి ఉమాశంకర్,బి వీరభద్రరావు ,బి మోహన్ రావు,బి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : పండగపూట విషాదం. వేములపల్లి లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం..!