యదాద్రి భువనగిరి : చిచ్చర పిడుగు..కరాటే వీరుడు, కెనడాలోని పోటీలకు దూరం.. ?

21బంగారు పతకాలు, 6 సిల్వర్ పతకాలు, 4 కాంస్యం, 11మెడల్స్

కరాటే వీరుడు. ఓటమెరుగని ధీరుడు

21బంగారు పతకాలు, 6 సిల్వర్ పతకాలు, 4 కాంస్యం, 11మెడల్స్

ప్రోత్సాహకులు లేక కెనడా దేశంలోని పోటీలకు దూరం

చౌటుప్పల్ (యదాద్రి భువనగిగి), మన సాక్షి : “శ్రమించి సాధించేవే సుఖాలను అందిస్తాయి” అన్నట్లు, చదివేది 9వ తరగతి, కానీ కరాటేలో అనేక పథకాలు సాధించి అతి చిన్నతనంలోనే తన సత్తా చాటాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు…అతి చిన్నతనంలోనే యదగటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు….అమ్మ,నాన్న,ఓ మాస్టారు వీరినే త్రిమూర్తులుగా ఆరాధించాడు. దీనికి తోడు పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం తోడైంది. దేశంలోని అనేక ప్రాంతాలలో జరిగిన కరాటే పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖమంత్రి శ్రీమతి సబితాఇంద్రారెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, సినీ నటుడు సుమన్ చేత ప్రశంసలు పొందాడు.

స్థానిక మున్సిపాలిటీ కేంద్రంలోని హనుమాన్ నగర్ కాలనీలోని పడాల బాలశంకరాచారి కుమారుడు పడాల అమృతేశ్వరచారి హైదరాబాదులోని వోకవుడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్నాడు. హైదరాబాద్ కు చెందిన కేతావత్ మహేష్ నాయక్ మాస్టర్ స్థాపించిన “యొద్ద గోజు ర్యు కరాటే శిక్షణ” కేంద్రంలో కరాటేలో శిక్షణ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. చిన్నప్పటినుండి కరాటే లో శిక్షణ తీసుకుంటున్న అమృతేశ్వరచారి ప్రతిభను కనిపెట్టిన కేతావత్ మహేష్ నాయక్ మాస్టర్ కరాటేలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో తన ప్రతిభా పాటవాన్ని మెరుగుపరుచుకుంటూ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కరాటే లో రాణిస్తున్నాడు.

రాష్ట్ర,జాతీయ ఛాంపియన్షిప్ లలో జరిగే పలు పోటీలలో పాల్గొని అనేక పథకాలు, అవార్డులు సాధించి అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు.ధైర్య సాహసలతో రాత్రింబవలు శ్రమిస్తూ జరగబోయే పోటీలలో తన ప్రత్యర్థి పై గెలుపే లక్ష్యంగా కరాటే సాధన చేస్తూ విజయాలను అందుకుంటూ తల్లిదండ్రులకు,చదివిన పాఠశాలకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాడు.

ఇప్పటివరకు సాధించిన రాష్ట్ర, జాతీయ స్థాయిలో పథకాలు, అవార్డుల వివరాలు: 

2016 నుంచి 2022 నవంబర్ వరకు హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్,ఢిల్లీ,నీరట్,గోవాగుంటూరు,ప్రాంతాల్లో జరిగిన జూనియర్ అండర్13,14 విభాగంలో జరిగిన కరాటే పోటీల్లో పాల్గొని మొత్తం 21బంగారు పతకాలు,6సిల్వర్,4 కాంస్యం ,11మెడల్స్ సాధించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పటి వరకు జరిగిన అన్ని పోటీల్లో ఎక్కడ వెనకడుగు వేయకుండా గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.

అన్ని తానై నడిపిస్తున్న కేతావత్ మహేష్ నాయక్ మాస్టర్ : 

అమృతేశ్వరచారిలోని ప్రతిభను గుర్తించిన కేతావత్ మహేష్ నాయక్ మాస్టర్ విద్యార్థికి అన్ని తానై ఎక్కడ కరాటే పోటీలు జరిగిన అక్కడికి తీసుకొని వెళ్తూ అమృతేశ్వరచారి లోని ప్రతిభను వెలికితీస్తూ,రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా గెలవటానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ తెలిపారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే చారి వంటి శిష్యుడు దొరికినందుకు తనకు గర్వంగా ఉందని కరాటే మాస్టర్ తెలిపారు. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. అమృతేశ్వర చారి లాంటి విద్యార్థులకు ఎల్లవేళలా తన వంతు సహాయం చేయడానికి తన సాయ శక్తుల కృషి చేస్తానని కరాటే శిక్షకులు కేతావత్ మహేష్ నాయక్ తెలిపారు. అమృతేశ్వరచారి మాట్లాడుతూ తనకు అన్నీ తానై నడిపిస్తున్న తన మాస్టర్ కు తాను రుణపడి ఉన్నానని అలాంటి గురువు దగ్గర శిక్షణ తీసుకోవడం గర్వంగా ఉందని తెలిపాడు.తనకు ఇన్ని పథకాలు అవార్డులు రావడానికి కారణమైన తన మాస్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

 ప్రతిభకు ఆదరణ కరువు : 

అమృతేశ్వరచారి ఎన్నో పథకాలు, అవార్డులు సాధించినప్పటికీ ఇతర దేశాలకు వెళ్లాలంటే ప్రయాసతో కూడిన పని కావడంతో కెనడాలో2021 ఏప్రిల్ జరిగిన పోటీలకు అండర్14 విభాగంలో ఎంపికైన తనకు ఆర్థిక స్థోమత సహకరించకపోవడంతో వెళ్లలేక పోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు,ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.ఇతర దేశాల్లో జరిగే పోటీలకు వెళ్ళటానికి ఎవరైనా స్పాన్సర్స్ సహకరిస్తే తమ బిడ్డని పంపించటానికి సిద్ధంగా ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఉత్సాహం ఏర్పడేలా చూస్తే అమృతేశ్వర చారి లాంటి విజేతలు ఎంతోమంది దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతారు. దేశ విదేశాలలో మన భారత జాతి కీర్తి పతాకాలు రేపరెపలాడుతాయి.అమృతేశ్వరచారి ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందిస్తే భవిష్యత్తులో ఒక మంచి కరాటే వీరుడుని మనం చూడవచ్చు.