Miryalaguda : మిర్యాలగూడ నుంచే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో..!

మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున షురూ చేయనున్నారు.

Miryalaguda : మిర్యాలగూడ నుంచే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో..!

మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున షురూ చేయనున్నారు. బస్సు యాత్రతోపాటు రోడ్ షోలు కూడా చేపట్టనున్నారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో మిర్యాలగూడ నుంచే రోడ్ షో ప్రారంభించనున్నారు. మిర్యాలగూడ నుంచి మెదక్ లో రోడ్ షో ముగిస్తుంది. ఈ సందర్భంగా కెసిఆర్ రోడ్ షో విజయవంత చేయడానికి శనివారం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శనివారం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన మిర్యాలగూడలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షో ప్రారంభించనున్నట్టు తెలిపారు.రోడ్ షోకు ఆయా మండలాల నుంచి బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతీరాం, జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, అడవిదేవులపల్లి ఎంపిపి బాలాజీ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బైరం సంపత్, మాజీ వైస్ ఛైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, పడిగాపాటి పెదకోటి రెడ్డి, కొత్త మర్రెడ్డి, భీమా నాయక్, కుర్ర శ్రీను నాయక్, వీర నాయక్ తదితరులు పాల్గొన్నారు.