కెసిఆర్ గొర్రెలు వచ్చినవి వచ్చినట్టే మాయమవుతున్నాయి..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదవ సోదరులకు  గొర్రెలు పంపిణీ భాగంగా మర్రిగూడ మండలానికి  ఇటీవల వందకు పైగా యూనిట్లు మంజూరు అయినాయి.

కెసిఆర్ గొర్రెలు వచ్చినవి వచ్చినట్టే మాయమవుతున్నాయి..!

మర్రిగూడ , మన సాక్షి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదవ సోదరులకు  గొర్రెలు పంపిణీ భాగంగా మర్రిగూడ మండలానికి  ఇటీవల వందకు పైగా యూనిట్లు మంజూరు అయినాయి.

ఒక యూనిట్ ధర  రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది 1.70000.   ఇందులో లబ్ధిదారుల డిడి 43 750 .1,50,000 గోర్లు. 20000 లలో  బీమా.మందులు. రవాణా ఖర్చులకు కాగా లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ గొర్రెలు కొనుగోలు చేయాలి. అక్కడికి వెళ్లి  తమకు నచ్చిన గొర్లను తెచ్చుకునే సదుపాయని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఒక యూనిట్ లో 20 గోర్లు  ఒక పొట్టేలు మొత్తం 21 ఉండే విధంగా ఈ స్కీమును రూపొందించారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

కానీ  ఆక్కడికి వెళ్లినా లబ్ధిదారులకు నాసిరకం  గొర్రెలు చూయించి.  21 గొర్రెకు బదులు 12 గొర్రెలను మాత్రమే ఇస్తున్నారు.  అక్కడ మాత్రం 21 అని వీడియోలో చెప్పమంటున్నారు? ఈ గోర్లు  బ్రతుకవు అని వెంటనే మాకే అమ్మాలని  పశువుల డాక్టర్ తో చెప్పిస్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు?  80 వేల రూపాయలకు దర చేసుకుని.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చిన ప్రతి గొర్రెకు భీమా టాగ్ వాటి చెవులకు వేసి ఫోటో తీసుకున్న తర్వాత.   పశువులడాక్టర్  వాటిని తనిఖీ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన వెంటనే ఆ చెవులకు వేసిన టాగులను తొలగించి. లబ్ధిదారులకు 80000 ఇచ్చి వాటిని మళ్లీ వాహనాలు ఎక్కించి ఆంధ్రకు పంపిస్తున్నారు.

ఇలా ప్రతిరోజు వందల వాహనాలు రీసైక్లిక్ అవుతున్నాయి? దీనిపై ఇలాంటి  పర్యవేక్షణ లేదు?  ఈ  భారీ స్కాం వెనకాల మండలానికి చెందిన  ఒక పశు వైద్యాధికారి పేరు ప్రముఖంగా వినపడుతుంది? ఒక్కో యూనిట్ 70 వేల నుండి 80 వేల వరకు అక్రమార్కుల జేబులోకి వెళ్తుందని గొర్రెల పెంపక దారులు ఆరోపిస్తున్నారు?

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!