విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు దగ్ధం

కంగ్టి , అక్టోబర్ 25, మన సాక్షి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కిరాణా షాపు మొత్తము అగ్నికి ఆహుతి అయిపోయింది. (పీఎం)
దామరగిద్ద గ్రామానికి చెందిన పద్మశాలి బాబు అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి తడ్కల్ గ్రామంలో కిరాణా కొట్టు పెట్టుకొని జీవిస్తున్నారు.

షాప్ ఓనర్ బాబు మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగలేదు కానీ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందన్నారు. చెలరేగిన మంటల్లో కిరాణా సామాన్ తో పాటు ఫ్రిజ్ టీవీ కొంత నగదు మంటల్లో కాలిపోయాయి అన్నారు. మంటలు చెలరేగా గానె స్థానికులు చుట్టూ ఉన్న ఇళ్ల వారందరూ వచ్చి మంటలను చెల్లారిపేశారు. సంఘటన స్థలానికి గ్రామ సర్పంచ్ గడ్డపు మనోహర్,ఎంపీటీసీ పొగాకుల శ్రీకాంత్, హుటా హుటిన వచ్చి షాప్ ఓనర్ ను కలిసి అగ్ని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు పెట్రోల్ డీజిల్ వల్లనే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు.