Miryalaguda : కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం పిఎం ఉష నిధులు.. ఐదు కోట్లు మంజూరు..!

అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పిఎం ఉష పథకం ద్వారా ఐదు కోట్లు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి బిక్షమయ్య తెలిపారు.

Miryalaguda : కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం పిఎం ఉష నిధులు.. ఐదు కోట్లు మంజూరు..!

మిర్యాలగూడ , మన సాక్షి :

అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పిఎం ఉష పథకం ద్వారా ఐదు కోట్లు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి బిక్షమయ్య తెలిపారు. ఈ నిధులతో నూతన భవన నిర్మాణ గదులు లైబ్రరీ , సెమినార్ హాల్, ప్రిన్సిపాల్ చాంబర్ ,గేమ్స్ అండ్ స్పోర్ట్స్ , యన్ సి సి ,యన్ యస్ యస్ గదులు, మెయిన్ రోడ్డు నుండి కళాశాల లోపటి వరకు రోడ్డు వేయడం , వాష్ రూమ్స్, ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మరమ్మత్తులు తదితర అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు.

పిఎం ఉష నిధులు సాధించడంలో సహకరించిన కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం కి, పిఎం ఉష ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌందర్య జోసెఫ్ కి ,జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.డి యస్ ఆర్ రాజేందర్ సింగ్ కి రీజినల్ జాయింట్ డైరెక్టర్ డా.జి.యాదగిరి కి అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాల భాస్కర్ కి , పిఎం ఉష ప్రాజెక్ట్ టీమ్ అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బిక్షమయ్య ని నోడల్ ఆఫీసర్ ఈ రామ్ రెడ్డి ని కళాశాల బోధన ,బోధనేతర సిబ్బంది , విద్యార్థిని, విద్యార్థులు , పూర్వ విద్యార్థులు అభినందించారు.

ALSO READ : Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!